Tuesday, April 24, 2012

షిర్డీ సాయి పుస్తకాలు



షిర్డీ సాయి పుస్తకాలు





 మిత్రులారా,
శ్రీ షిర్డీ సాయి సాంప్రదాయం లో ముఖ్యులు, పుజ్యనీయులయిన శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి ప్రియ శిష్యులు, సాయి ఆదేశంతో, 


ఉద్యోగాన్ని కూడా త్యజించి, కేవలం... సాయి కి సంబంధించిన పుస్తక రచనతో, ఆశ్రమ జీవితం గడుపుతున్న నిరాడంబరులు, 


నాకు గురుతుల్యులు అయినా శ్రీ మన్నవ సత్యం గారి రచనలు, సందేశాలు చదవడానికి తప్పక దర్శించండి,

వీరి సంక్షిప్త సాయి చరిత్ర, చిన్న పుస్తకం చాలా అధ్భుతమయినది.  ఆసక్తి ఉన్న వారు, తెప్పించుకుని చదువుకోవచ్చు.

 http://www.sailokam.com/


ధన్యవాదములు.

Saturday, April 21, 2012

మహాకవి కాళిదాసు


మహాకవి కాళిదాసు





'వాగార్దావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ'

పదానికి, ఆ పదపు భావానికి ఉన్న అవినాభావ సంబంధం ఎలాంటిదో, అలాంటిదే పార్వతీ...
పరమేశ్వరుల 

అనుబంధము. కవి ఇక్కడ పార్వతీ పరమేశ్వరులను, పదానికి, దానికి గల అర్ధానికి, తన కావ్యంలో పొందిక 

కుదిరేలా, ఆశీర్వదించమని అర్ధనారేశ్వరి స్వరూపమయిన ఆది దంపతులను వేడుకుంటాడు. అర్ధనారీశ్వర తత్త్వం 

అంటే, భార్యభర్తలు ఒకే మనసుతో, ఒకే తనువుతో, ఒకే ఆలోచనతో విడదీయరాని అనుబంధాన్ని కలిగి ఉండడం.


కవితకు భావం ఎంత ముఖ్యమో, శబ్దసౌష్టవం కూడా అంతే ముఖ్యం. భావాన్ని బట్టి శబ్దం, అంటే, పద జాలం, 

మారుతూ ఉండాలి. గంభీరమయిన భావానికి గంభీరమయిన పదజాలం,లలితమయిన భావానికి లలితమయిన 

పదజాలం ఉంటేనే, ఆ కవిత ఆకట్టుకుంటుంది.
 'కవి కుల గురువు' గా చెప్పబడే కాళిదాసు, గొప్ప సంస్కృత కవి, మరియు నాటకకర్త. విక్రమాదిత్యుని 

కొలువులోని 'నవరత్నాల' లో ఒకరిగా ప్రసంసలు పొందారు. 'ఉపమాకాళిదాసః ..', అంటే పోల్చడం లో 

కాళిదాసును మించిన వారు లేరు.
కాళిదాసు రచించిన మూడు ముఖ్యమైన నాటకాలు మాళవికాగ్నిమిత్రము (మాళవిక మరియు అగ్నిమిత్రుని 

కథ), విక్రమోర్వశీయము (విక్రముడు మరియు ఊర్వశి కథ) మరియు అభిజ్ఞానశాకుంతలము (శకుంతలను గుర్తించుట).


*కావ్యాలు *


మేఘసందేశం
కుబేరుని కొలువులో ఉన్న ఒక యక్షుడు, కర్తవ్య నిర్వహణలో తప్పిదం వల్ల, శాపానికి గురై, ఒక సంవత్సరం పాటు, 


మహిమలు పోగాట్టుకుని, దేశం నుంచి వెలివేయబడి, రామగిరి అడవుల్లో తిరుగుతూ ఉంటాడు. విరహంతో ఉన్న 

తన ప్రియురాలికి, ఒక ఆషాడ మబ్బు తునకను , తన సందేశాన్ని ప్రియురాలికి అందించమని కోరతాడు. 

మేఘానికి వెళ్ళవలసిన దారిని, మధ్యలో కనిపించే రమణీయ దృశ్యాలను, అద్భుతంగా ,వర్ణించి చెబుతాడు.

'మిత్రమా! గాలి పాటు నీ ప్రయాణానికి అనుకూలంగా ఉంది. శుభ శకునాలు కనుపిస్తున్నాయి. హంసలు నీకు 


మానస సరోవరం దాకా తోడు వస్తాయి. దారిలో అలసిపోతే కొండ కొనలపై విశ్రాంతి తీసుకో. శక్తి ఉడిగితే మధురమైన 

నదీజలాలను ఆస్వాదించు.


మధ్యలో నెమళ్ళు అందంగా నిన్ను స్వాగతిస్తాయి. కాని మైమరచి కార్యాన్నివిస్మరించవద్దు సుమా!. నేను 

త్వరలోనే తిరిగి వస్తానని, దిగులు చెందవద్దని, నా ప్రియురాలికి,నా సందేశంగా చెప్పు.' దీనమయిన, అతని 

సందేశాన్ని విని, యక్షరాజు, శాపాన్నిఉపసంహరించుకుని, ప్రేయసి-ప్రియులను కలపడం, ఈ కావ్యానికి ముగింపు.

కుమార సంభవం


దక్ష యజ్ఞం, సతీ దేవి ఆత్మాహుతి, శివుని ఘోర తపస్సు, మన్మధుడిని భస్మం చెయ్యడం, పార్వతి శివుని తపస్సు 


ద్వారా ప్రసన్నం చేసుకోవడం, శివపార్వతుల కల్యాణం, తారకాసుర సంహారానికి, కుమార స్వామి జననం, 

తారకాసుర సంహారం మొదలయినవి ఈ కావ్యంలో చక్కగా వర్ణించారు.


రఘువంశము

రఘువు ఇక్షాకు వంశంలోని ప్రముఖ చక్రవర్తి. ఇతని వంశ క్రమాన్ని *రఘు వంశము* అంటారు.


ఋతు సంహారం

ఇది ఆరు ఋతువులకు(గ్రీష్మ, వర్ష, శిశిర,శరత్, హేమంత , వసంత ) సంబంధించిన పద్యాల సంకలనం.


వసంత ఋతువుకు సంబంధించి, ఋతు సంహారం లోని ఒక పద్యం.


ద్రుమాః సపుష్పాః సలిలం సపద్మం
స్త్రియః సకామాః పవనః సుగంధిః
సుఖా ప్రదోషాః దివసాశ్చ రమ్యాః
సర్వం ప్రియే చారుతరం వసంతం

(ఋతుసంహారం కాళిదాసు)

(చెట్లు పువ్వుల్తోనూ, సరస్సుల్లో నీళ్ళు తామరపువ్వుల్తోనూ నిండి ఉన్నాయి.స్త్రీలు కోర్కెలతో నిండి ఉన్నారు. గాలిలో సుగంధం నిండి ఉంది. సుఖవంతమైన సాయంత్రాలూ, రమ్యమైన పగళ్ళూ.. ఓ ప్రియా! వసంతం చాలా అందంగా ఉంది.)

రాజు- కవి వివాదం

ఒక సారి భోజరాజుకి కాళిదాసుకు కొంచెం మాట తేడా వచ్చి కాళిదాసు రాజు గారి మీద అలిగి చెప్పా పెట్టకుండా 


ఎక్కడికో వెళ్ళిపోయాడట! కాళిదాసు ఆచూకీ తెలుసుకోవాలంటే ఒకటే మార్గమని తలచి ఈ సమస్యను తయారు 

చేసి చాటింపు వేయించాడు.

'కుసుమే కుసుమోత్పత్తిహి శ్రూయతే నతు దృశ్యతే '
పువ్వులోంచి పువ్వు పుడుతుంది అనేమాట వినడమే కానీ చూడలేదు....! ఈ సమస్యను పూరించిన వారికి గొప్ప నజరానా అని ప్రకటించాడు.
ఎక్కడో ఒక వేశ్య సముఖంలో ఉన్న కాళిదాసు, ఆ సమస్యను ఇలా పూరించారు.
బాలే తవ ముఖాంభోజే దృష్టమిందీవర ద్వయం'
'బాలా, నీ ముఖమనే తామరపూవులో రెండు నల్ల కలువలు కనిపిస్తున్నాయి' వెంటనే, కాళిదాసును గుర్తించిన భోజరాజు, ఆయనకు క్షమాపణ చెప్పి, తిరిగి తన కొలువులోనికి తీసుకువచ్చాడట. ప్రకృతి సౌందర్యం, సాఘిక విషయాలతో పాటు, రాజుల నాయకత్వ లక్షణాలు, స్త్రీ యొక్క బాహ్య, మానసిక సౌందర్యాలను కూడా తన కావ్యాల్లో వర్ణించారు. 'రాజు మరణించే రాతి శాసనములందు... సుకవి జీవించే ప్రజల నాలుకలయందు...' కవికుల చిరంజీవి, కాళిదాసు.


References:

http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B3%E0%B0%BF%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%81
http://www.eemaata.com/em/issues/200105/642.html
http://vihanga.com/?p=3615

శ్రీ చాగంటి వారి ప్రవచనాలు

శ్రీ చాగంటి వారి ప్రవచనాలు


మిత్రులారా,

మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను సవివరంగా, ఆసక్తికరంగా వివరించే శ్రీ 



చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనాలు online వినడానికి, ఇంకా డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ ఉపయోగించండి.

వీరు తమ ప్రవచనాలకు గాని, సందేశాలకు గాని ఒక్క రూపాయి ఆశించక, ఉచితంగా ధర్మ ప్రచారం చేస్తున్న 


మహనీయులు. ఇంతటి గొప్ప వ్యక్తులను ఈ కర్మ భూమిలో తప్ప మరెక్కడయినా చూడగలమా?

www.srichaganti.net

ధన్యవాదములు.

అమరావతి కధలు








అమరావతి కధలు


అమరావతి.

గుంటూరు జిల్లాలో చిన్న ఊరు. కృష్ణ నది. నదీ తీరాన పంచారామాల్లో ఒకటయిన అమరేశ్వరాలయం. ఆలయం 



చుట్టూ వ్యాపించిన పున్నాగ పూల చెట్లు, ఆలయ ప్రాంగణం అంతా పూలతో అలంకరిస్తాయి. కార్తిక మాసంలో నది 


నిండా కొత్త నీరు, గాలిలో పున్నాగ పూల పరిమళం, రేవు దాటి నిశ్శబ్దంగా కూర్చుంటే, ఏదో మౌన సందేశాన్ని


వినిపించే ప్రకృతి. కాలం ఎలా గడిచిపోతుందో తెలియదు.ఆ ప్రశాంతత అనుభవిస్తే గానీ మాటల్లో చెప్పలేనిది. ఆ 


ప్రదేశం అంటే నాకు ఎంతో ఇష్టం. ఎన్ని సార్లు వెళ్లినా, ప్రతి సారి ఏదో కొత్త స్వాంతన ఆ గాలిలో. అదే ప్రశాంతత 


'శంకరమంచి సత్యం' గారిని ప్రేరేపించి ఉంటుంది 'అమరావతి కధలు' రాయడానికి. ప్రతి కధలో మనల్ని ఆ పాత్రల్లో 


ఇమిడ్చి, అలా కృష్ణ ఒడ్డుకు, వాన చినుకులకు, ఆలయ ప్రశాంతతకు, భావోద్వేగాలకు గురి చేస్తారు. ఆ గాలి, మట్టి, 


నీరు, అన్నిటిని ఆస్వాదించి, మధించి కధలుగా అందించారు.

మిత్రులారా, మనం ఎంతో అదృష్టవంతులం. అంతర్జాలం ఒక వరమయితే, అభిరుచి ఉన్న తెలుగు వాళ్ళు మన 



తెలుగు సాహిత్యాన్ని బ్రతికించడానికి పడే ప్రయాస మరొక వరం. కొన్ని అమరావతి కధలు క్రింది లింక్ లో 


చదువుకోండి. సహజత్వం, నిరాడంబరత్వం నిండిన ఆ కధల్లో మిమ్మల్ని మీరు మరచిపోండి.

http://www.greatertelugu.com/telugu-books/Pustakalu/Amaravati-kathalu/Rendu-gangalu.pdf


చందమామ - ఆన్ లైన్




చందమామ - ఆన్ లైన్

మిత్రులారా,
చిన్నప్పటి చందమామలు చదువుకున్న రోజులు గుర్తున్నాయా? బేతాళ కధలు, నీతి కధలు, జానపద serials , 



పోటీలు పడి మరీ చదువుకునేవాళ్ళం కదూ. చందమామ ఎడిటర్ శ్రీ... రాజశేఖర్ గారు క్రింది లింక్ ను పంపించారు. 


చూడగానే చాలా సంతోషం వేసింది. ఏదో పోగొట్టుకున్న పెన్నిధి దొరికినంత ఆనందం కలిగింది. ఇందులో, 1947 


నుంచి చందమామలు మనకు కావలసిన భాషలో, కావలసిన సంవత్సరం, నెల ఇచ్చి online చదువుకోవచ్చు. 


ఇంకా మన చిన్నారులకు మంచి మంచి కధలు చదివి వినిపించచ్చు. శ్రీరాజశేఖర్ గారికి నా ధన్యవాదములు. లింక్ 


సేవ్ చేసుకుంటారు కదూ ,


ధన్యవాదములతో


పద్మిని
http://www.chandamama.com/archive/storyArchive.htm

ఎంకి పాటలు




ఎంకి పాటలు
ఎప్పుడయినా గోదావరిలో పడవ ప్రయాణం చేసారా? అంటే ఇప్పటి మర పడవలు కాదు. తెడ్డు వేస్తూ, ప్రశాంతంగా 


సాగే పడవలు. చిత్రంగా, ఆ పడవ వాళ్ళు కమ్మటి పాటలు పాడతారు. ఎవరు నేర్పారు అంత సంగీత జ్ఞానం వాళ్ళకి?  


గోదారి తల్లా, పడవా, అలలా, ప్రక్రుతా? సహజంగా, అలవోకగా పడవ వాళ్ళకి పాట వొస్తుంది. అంతే అలవోకగా రైలు 


ప్రయాణం లో తట్టిందట నండూరి వారికి ఎంకి పాట. ఏదో తనలో తను పాడుకుంటూ ఉంటే, మిత్రుడు ఏదీ, 


వినిపించామన్నారట. అలా మొదలైనదే, 'గుండె గొంతుక లోన కొట్లాడుతాది' అనే మొదటి ఎంకి పాట.


ఒక ఊహా జనితమయిన ఎంకి ప్రేమ భావనలో మునిగి, ఆమె చూపు, మాట, పాట, కట్టు-బొట్టు, సాన్నిధ్యం, 


ఎడబాటు, అన్నిటిని ఆ కల్పనలోనే అనుభవించి, ఆ భావాలకు భాషను కూర్చి, మనందరినీ ఆ పాటలతో అలరించి, 


చివరికి ఎంకి పేరును ఇంటి పేరు తో జత పరచుకునే దాకా వదలలేదు నండూరి వారు. మొత్తానికి ఎంకి- 


నాయడుబావ లను మన తెలుగు వారి మధ్య శాశ్వతంగా నిలిపి వెళ్లారు ఆయన.


 సాహిత్యం చదవాలని ఆసక్తి ఉన్నవారు క్రింది లింక్ ను ఉపయోగించుకోండి.

http://in.dir.groups.yahoo.com/group/anantapur_pals_82/message/౩౨౩౧

పాటలను వినాలనుకునే వారు, ఔత్సహికులయిన కళాకారులు పాడిన ఈ లింక్ ను ఉపయోగించండి.

http://www.muzigle.com/album/yenki-patalu

ధన్యవాదములు.

భానుమతి- అత్తగారి కధలు








భానుమతి- అత్తగారి కధలు


భానుమతి రామకృష్ణ. బహుముఖ ప్రజ్ఞాశాలి . నటన, గాత్రం, అభినయం వీటన్నిటితో, సాటి నటులన్దరిని 


మరపిన్చగల సామర్ధ్యం. ఆవిడలోని ఇంకోక  విశేషం, హాస్య సాహితి కధల్ని పండించడం లో దిట్ట. ఆవిడ రచించిన

'అత్తగారి కధలు' హాస్యం తో పాటు సందేశాన్ని కలిపి, భాష తో ప్రాసని కలిపి మనసుని ఆహ్లాద పరుస్తాయి.

'కృష్ణార్పణం' అంటూ అత్తగారి ఆవకాయ కధైనా , ' వడియాలు వడగళ్ళ లాగ ఉన్నాయి' అంటూ మరొక కధైనా ,

ప్రతి కధా ఒక మచ్చు తునక. ఎవరో సాహితి పిపాసులు, ఆ కధల్ని mp3 లో రికార్డు చేసి పెట్టారు. తీరిక సమయం

లో తప్పక వినగలరు. లింక్ http://techsri.wordpress.com/2009/05/01/attagari-kathalu/ ఇది.

నిందా- స్తుతి





నిందా- స్తుతి


నిందా-స్తుతి (scolding praise ), లోపాలను ఎత్తి చూపుతూ పొగడడం, తెలుగు భాష లోని ఒక వైశిష్ట్యం.చాటువులని( humorous verses ) మరొక పేరు. సందర్భానికి, వ్యక్తుల మనస్తత్వాలకి తగినట్టుగా ఆశువుగా చెప్పే పద్యాలు. ఇవి కొన్ని మాత్రమే. మరెన్నో ఉన్నాయి అంతర్జాలం(ఇంటర్నెట్) లో. చదివి ఆనందించండి.
అప్పట్లో రాయల సీమలో వర్షాలు లేక పోతే, శ్రీ నాధుడు శివునిపై రాసిన పద్యం --

"సిరి గల వానికి చెల్లును,
తరుణులు పదియారు వేలు తగ పెండ్లాడన్,
...
తిరిపెమునకిద్దరాండ్రా,
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.."

 "ఓ పరమేశా, లక్ష్మి పతి పదహారు వేల మందిని పెళ్ళాడినా, సిరి కలవాడు కనుక చెల్లింది. ఆది భిక్షువయిన నీకు ఇద్దరు ఇంతులు ఎందుకు గాని గంగ ను విడిచిపెట్టు. అంటే వర్షాన్ని కురిపించమని ప్రార్ధన. శ్రీనాధుడి చాటువుకి నిజంగానే వర్షం కురిసింది."

ఒక కన్ను పోయిన రాజు తన ఆస్థాన కవులను, అతని కళ్ళను పొగుడుతూ పద్యం రాయమన్నాడుట. రాయలేని వారందరూ శిక్షార్హులు. అప్పుడు ఒక కవి ఈ చాటువు వ్రాసారు.
"అన్నాతి గూడ హరుడవే
అన్నాతిని గూడనప్పు డసుర గురుడవే
అన్నా! తిరుమల రాయా!
కన్నొక్కటి మిగిలె గాని కౌరవ పతివే !"



 " మీ శ్రీమతి పక్కనుంటే, ఆవిడ కళ్ళతో కలిపి ముక్కంటివి, లేకపోతె, ఒక్క కంటితో శుక్రాచార్యుడంతటి వాడివి, ఆ దిక్కుమాలిన ఒక్క కన్ను మిగిలింది కాని, లేకపోతె, ద్రుతరష్టుడంతటి వాడివి అయ్యేవడివి."


ఒక తుంటరి అబ్బాయి ఈ క్రింది పద్యంలో
"ఒసే! దరిద్రపు దానా! కొంచం సున్నం తెచ్చి పెట్టవే!" ... అంటే

పర్వత శ్రేష్ఠ పుత్రికా పతివిరోధి
యన్న పెండ్లాము అత్తను గన్న తల్లి(/తండ్రి)
పేర్మి మీరిన ముద్దుల పెద్దబిడ్డ
సున్న మించుక తేగదే సుందరాంగి(/సన్నుతాంగి)
( పార్వతి, శివుడు, మన్మథుడు, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మి,
సముద్రుడు(/అతని భార్య), జ్యేష్ఠా దేవి (దరిద్ర దేవత) )

ఆ గడుసరి అమ్మాయి ఇలా అని సున్నం ఇచ్చిందట !(తమలిపాకులోకి)
"ఓరి కుక్కా! ఇదుగో సున్నం!"

శతపత్రంబుల మిత్రుని
సుతు జంపినవాని బావ సూనుని మామన్
సతతము దాల్చెడు నాతని
సుతువాహన వైరి వైరి సున్నంబిదిగో
( కమలము, సూర్యుడు, కర్ణుడు, అర్జునుడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు,
చంద్రుడు, శివుడు, గణపతి, ఎలుక, పిల్లి, కుక్క )


 సిరివెన్నెల సినిమాలో సిరివెన్నెల గారు రచించిన 'ఆదిభిక్షువు వాడినేది కోరేది' పాట మరొక ఉదాహరణ.

Tuesday, April 17, 2012

రాధికా సాంత్వనం





రాధికా సాంత్వనం


ముద్దుపలిని(1730 -1790 ), 18  వ శతాబ్దం లోని తంజావూరు నాయక రాజుల ఆస్థాన విద్వాంసురాలు. ఈమె 


వివిధ కళల లో  నిష్ణాతురాలే కాక, తెలుగు, సంస్కృత భాషలపై మంచి పట్టు ఉన్న రచయిత్రి. సహజంగా 


సాహిత్యాభిమానులు, కళా పిపాసులు, అయిన తంజావూరు రాజులు సంగీత సాహిత్యాలలో ప్రవేశం ఉన్న స్త్రీలను 


కూడా గౌరవించి, పురుషులతో సమానంగా గౌరవించి, కొలువు ఇప్పించేవారు. ఆంధ్ర నుంచి వలస వచ్చిన ఈ 


దేవదాసీలు , అదృష్ట చిహ్నాలుగా, సంఘం లో గౌరవాన్ని పొందేవారు. 

ముద్దుపలిని తెలుగులో రచించిన 'రాధికా సాన్త్వనం'( రాధిక సాంత్ -వనం: రాధికను సమింపచేయడం) లో , 



రాధాకృష్ణులకు సంబంధించిన 584  పద్యాలు ఉన్నాయి. ఈమెకు కృష్ణుడు స్వయంగా చిన్న బాలుడిగా, కలలో 


కనిపించి, ఈ కావ్యాన్ని వ్రాయమని చెప్పాడట. ఈమె కావ్యాన్ని రచించి, కృష్ణుడికి అంకితం ఇచ్చిందట. 


'శృంగారప్రబంధం' అయిన ఈ కావ్యం లో,  శృంగార రసాన్ని ప్రతిబింబించిన ఈ కావ్యం,  సంఘం చేత 


బహిష్కరించబడి, తగులబెట్టబడినా, ఇంకా కొన్ని ముద్రణలు అందుబాటులో ఉండడం వల్ల  వెలుగులోకి వచ్చింది.


ముద్దుపళని అమ్మమ్మ, అమ్మా కూడా రచయిత్రులట. తన గురించి తను ఇలా వర్ణించుకుంటుందట.


'నా కులంలో జన్మించిన యే వనితకు, ఇన్ని బహుమానాలు, పండితురాలి గౌరవం దక్కింది? ఇన్ని కావ్యాలు అంకితం ఇప్పించుకునేంత మర్యాద దక్కింది? ప్రతి కళ లో ప్రత్యేకమయిన స్థానం దక్కింది? ముద్దుపళని, నీకు నీవే సాటి'


'పూర్ణ చంద్రునిలా వెలిగే మోము, ముఖ వర్చస్సుకు తగిన వాక్చాతుర్యం, మాట్లాడేటప్పుడు, దయాగుణాన్ని ప్రతిబింబించే కళ్ళు, కళ్ళలోని కాంతులకు జతకూడే ఉదార స్వభావం, ఇవే రాచకోలువులో, పలని ని భుషించే అలంకారాలు.'


కృష్ణుడికి ప్రియమయిన రాధ, కృష్ణుడి నూతన వధువయిన, తను పెంచిన, ఇలాదేవి అనే యువతి తో  తన 


అనుభవాలను పంచుకున్టుందట. శృంగారంలో స్త్రీ పాత్ర,  స్త్రీ పురుష అసమానతలు, తన ఇష్టాలను నిస్సంకోచంగా 


వ్యక్త పరచమనే విధానం, చూపవలసిన చొరవ, అన్నీ సవివరంగా వర్ణిస్తుంది. కృష్ణ, ఇలలు ఒకరిని ఒకరు వదలలేని


స్థితికి చేరుకుంటారు. విరహతప్త అయిన రాధ, కృష్ణునిపై ద్వేషాన్ని పెంచుకుంటుంది. చివరికి కృష్ణుడు రాధ 


కోపాన్ని, తాపాన్ని యే విధంగా శమింప చేసాడనేది కావ్య ఇతివృత్తం. స్త్రీ హృదయం ఆశించేది, పురుషుడి నుంచి 


లభించే ప్రేమను, స్వాంతనను  అని, చివరికి తెలియజేస్తుంది. రాధ పాత్ర ద్వారా, తనను తానూ ఆవిష్కరింప 


చేసుకుంటుంది, రచయిత్రి. ఇందులో స్త్రీ హృదయం లోని సున్నితత్వం, శృంగార పరంగా అసూయతో కూడిన 


దృక్పధం, తెలిసిన రాదా కృష్ణుల కధలో, ఆవిడ సృష్టించిన వైవిధ్యం, చెప్పుకోదగినవి.


'ముద్దు పెట్టద్దంటే, చెక్కిలి తట్టి, గట్టిగా నా పెదవులని ముద్దాడుతుంది, నన్ను మైమరపిస్తుంది, తన మాటలతో, 


చేష్టలతో, పదే పదే తనను ప్రేమింపచేసుకుంటుంది, తన చీర రవికనయినా బాగుండును, మత్స్య కూర్మ 


అవతారాలతో నన్ను పోలుస్తారు...రాధా.. ఎలా నీ నుంచి, నీ సాంగత్యం నుంచి, దూరంగా ఉండడం?


ఈవిడ రచనను స్త్రీ జనోద్ధరకులుగా, సంఘ సంస్కర్తలుగా చెప్పుకునే, ఆ నాటి పురుషులు కూడా అంగీకరించలేక ,


 ఈ కావ్యం చదవకూడదని , ముద్దుపళని విసృన్ఖల స్త్రీ అని ముద్ర వేసారు. మొత్తానికి ముద్దుపళని రచన 


పురుషాధిక్య శృంగారానికి ఒక ధిక్కారం. స్త్రీల దృక్పధాన్ని, స్త్రీ మనసును ఆవిష్కరించిన ధీర, ముద్దుపళని.  


http://javous308.blogspot.in/2011/05/women-well-set-free.html

Saturday, April 14, 2012

బాపు-రమణ

బాపు-రమణ

ప్రఖ్యాత సినిరచయత 'సిరివెన్నెల' మా మ్యూజిక్ అవార్డ్స్ లో మాట్లాడుతూ, తెలుగువారి చరిత్ర నీ బాపు రమణల 


ముందు శకంగా, బాపు రమణల తర్వాతి శకంగా , అంటే A.C,B.C లా లాగ విభజించాలని చెప్పారు. ఆ ఇద్దరు 


మిత్రులు కోతికోమ్మచ్చులాడిన, మురిపెం తీరక ఇంకోతికోమ్మచ్చులాడిన, భక్తిగా రామ కధ రాసినా, తీసినా 


మన కన్నులపంటే. ఒకరు భావాన్ని ఒలికించడం లో దిట్ట, ఒకరు భావాన్ని పలికించడంలో దిట్ట.

'బుడుగు' రాసి ఎంత కాలమైనా, 'ఇంతింతై, బుడుగిం తై, సాహిత్య వీదిపై నంతై,

ఆంధ్రవనిన్ పోకిరి చేష్టలన్ బ్రహ్మాన్డతర సంవర్ధియై' వెలుగుతున్నాడు.

బుడుగు చదివిన వాళ్ళకి

ముళ్ళపూడి వారి ఆశీస్సులు, చదవని వాళ్ళకి...జాటర్ డమాల్

అంటే,


బుడుగుకు కోపం వస్తుందన్నమాట. .









మిత్రులారా,

ముళ్ళపూడి వారి బుడుగు online చదువుతారా? ఇంకా మంచి కార్టూన్లు కూడా ఉన్నాయి ఈ లింక్ లో. 


చూడండి.


http://www.scribd.com/doc/10916606/BUDUGU

Wednesday, April 11, 2012

గోదావరి కధలు









గోదావరి కధలు 



'జీవితాన్ని సాహిత్యంగా మార్చడం, పచ్చి పాల లోంచి వెన్న తియ్యడం లాంటిది.' ఒక మంచి కధ రాయడానికి 


చాలా సత్తా, ఇంకెంతో మంచితనం కావాలి. పెద్ద మనసుతో రాసిన పెద్ద కధలు, మా సీతారాముడు మావయ్యగారి 


'గోదావరి కధలు.' ఇవన్ని గోదావరి గాలి పీల్చి, గోదావరి నీరు తాగి, బ్రతుకుల్ని పండించుకున్న కధలు. ఒక్కో 


కధ, ఒక్కో మచ్చుతునక. స్వచ్చమయిన గోదావరి నీళ్ళలో ప్రతిబింబించే పున్నమి చంద్రుడిలా,ఒక్కో కధ, 


ఆయా పాత్రల తీరును మన కళ్ళ ముందు ఆవిష్కరిమ్పజేస్తుంది. ఈ కధల గురించి వారి మాటల్లో,

'ప్రవాహంలో తరంగాల్లా, ఎన్నో జీవితాలు కాల ప్రవాహంలో సాగిపోతుంటాయి.తరంగానికి దిగువన మనకు 


కనబడని మరో తరంగం ఉంటుంది. ఆ తరంగ శక్తే, మనకు కనబడే తరంగాన్నినడిపిస్తుంది. అలాగే మనమేరిగిన 


వ్యక్తుల జీవితాల వెనుక మనమేరుగని ఎన్నో నిజాలు దాగి ఉంటాయి. అలా సాగే కధలకు పారే గోదావరే సాక్షి.'

చక్కటి హృద్యమయిన ఈ కధలను చదవడానికి, డౌన్లోడ్ చేసుకోడానికి, కింది లింక్ ను


ఉపయోగించండి.


Sunday, April 8, 2012

వంశి కధలు




వంశి కధలు 
మిత్రులారా,

మనసు అద్దం లాగ ఉంటే, ఎవరి రుపమయినా ప్రతిబింబిస్తుంది. మనసు చిగురుటాకులా ఉంటే, నీరెండయినా, 



వాన చినుకయినా, మంచు బిందువయినా, దాని మీద పడితే, తళుక్కున మెరుస్తుంది. మనసు సెలయేటి నీరు 


అంత స్వచ్చంగా ఉంటే, ఎదుటి మనిషి లోతుల్నిస్పష్టంగా చూపిస్తుంది. రచనలు రచయత మనస్తత్వాన్ని, 


అభిరుచులని వ్యక్తపరుస్తాయి. అలాంటి వెండి మనసు ఉన్న సినీ దర్శకులు, రచయత, సంగీత  దర్శకులు, ఈ 


మధ్యనే పాటలు కూడా పాడిన గాయకులూ, వంశి. ఆయన పసలపూడి కధలకు ప్రేరణ, సీతారాముడు 


మావయ్యగారి గోదావరి కదలట. 'మన్యం రాణి' చదువుతున్నప్పుడు,మనల్ని ఆ అడవుల్లో, అడవి పూలలో, తేట 


మనుషుల్లో విహరింప చేస్తారు. పసలపూడి కధలు, గోదావరి కధలు చదువుతుంటే, మనం కూడా అక్కడే పుట్టి 


పెరిగిన అనుభూతి కలిగిస్తారు. అక్కడి మనుషుల్ని, దృశ్యాలని కళ్ళకు కట్టినట్టు రాయడం ఆయన ప్రత్యేకత. ఇక 


ఆయన సినిమాల్లోని పాత్రలు సహజంగా, మన చుట్టుపక్కల ఉండే వ్యక్తుల్లా అనిపిస్తాయి. సహజత్వం, 


నిరాడంబరత్వం, కొంత అమాయకత్వం, మమకారం, ఆప్యాయత ఆయన పాత్రల్లో ప్రతిబింబిస్తాయి. విశ్వనాధ్ 


గారి సహ దర్శకులుగా సినిప్రస్తానం మొదలు పెట్టిన వంశి, తన 'మహల్ లో కోకిల' అనే నవలను 'సితార'


సినిమాగా రూపొందించారు. తరువాత అన్వేషణ, ప్రేమించు పెళ్ళాడు, లేడీస్ టైలేర్ వంటి  సినిమాలకు 

దర్సకత్వం వహించారు.వంశి 'మా దిగువ గోదావరి కధలు' డౌన్లోడ్ లింక్,
మా పసలపూడి కధలు , కేవలం రెండే కధలు దొరికాయి, డౌన్లోడ్ లింక్స్ ,



వంశితో ఓపెన్ హార్ట్ ఇంటర్వ్యూ చూడడానికి, క్రింది లింక్ ఉపయోగించండి.

http://www.teluguportals.com/2012/02/abn-openheart-with-rk-with-vamsi/

ధన్యవాదములు.