Saturday, April 21, 2012

అమరావతి కధలు








అమరావతి కధలు


అమరావతి.

గుంటూరు జిల్లాలో చిన్న ఊరు. కృష్ణ నది. నదీ తీరాన పంచారామాల్లో ఒకటయిన అమరేశ్వరాలయం. ఆలయం 



చుట్టూ వ్యాపించిన పున్నాగ పూల చెట్లు, ఆలయ ప్రాంగణం అంతా పూలతో అలంకరిస్తాయి. కార్తిక మాసంలో నది 


నిండా కొత్త నీరు, గాలిలో పున్నాగ పూల పరిమళం, రేవు దాటి నిశ్శబ్దంగా కూర్చుంటే, ఏదో మౌన సందేశాన్ని


వినిపించే ప్రకృతి. కాలం ఎలా గడిచిపోతుందో తెలియదు.ఆ ప్రశాంతత అనుభవిస్తే గానీ మాటల్లో చెప్పలేనిది. ఆ 


ప్రదేశం అంటే నాకు ఎంతో ఇష్టం. ఎన్ని సార్లు వెళ్లినా, ప్రతి సారి ఏదో కొత్త స్వాంతన ఆ గాలిలో. అదే ప్రశాంతత 


'శంకరమంచి సత్యం' గారిని ప్రేరేపించి ఉంటుంది 'అమరావతి కధలు' రాయడానికి. ప్రతి కధలో మనల్ని ఆ పాత్రల్లో 


ఇమిడ్చి, అలా కృష్ణ ఒడ్డుకు, వాన చినుకులకు, ఆలయ ప్రశాంతతకు, భావోద్వేగాలకు గురి చేస్తారు. ఆ గాలి, మట్టి, 


నీరు, అన్నిటిని ఆస్వాదించి, మధించి కధలుగా అందించారు.

మిత్రులారా, మనం ఎంతో అదృష్టవంతులం. అంతర్జాలం ఒక వరమయితే, అభిరుచి ఉన్న తెలుగు వాళ్ళు మన 



తెలుగు సాహిత్యాన్ని బ్రతికించడానికి పడే ప్రయాస మరొక వరం. కొన్ని అమరావతి కధలు క్రింది లింక్ లో 


చదువుకోండి. సహజత్వం, నిరాడంబరత్వం నిండిన ఆ కధల్లో మిమ్మల్ని మీరు మరచిపోండి.

http://www.greatertelugu.com/telugu-books/Pustakalu/Amaravati-kathalu/Rendu-gangalu.pdf


5 comments: